Saturday, 19 March 2011

Telugu Proverbs--తెలుగు సామెతలు

                              శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు 
మనిషి కష్టకాలంలో క్రున్గిపోకుడదు. అలాంటి సమయంలో ధైర్యంతో నిలబడి సమస్యలను ఎదుర్కోవాలి.కష్టం కలిగినపుడు దానికి కలిగిన కారణాలేంటో తెలుసుకోవాలి. దానివల్ల ఆ కస్టాలు మనకు దురమవుతాయి. అంతేగాని దేనితోనో , ఎవరితోనో  పోల్చకోకుడదు . అలా చేస్తే భాదే తప్ప ఇంకా ఏమి మిగలదు. కస్టాలు కలిగినపుడు అంతకు పదిరెట్లు ఉపాయాలు ఉండనే ఉంటాయి. ఆ ఉపాయాన్ని అలోచించి దాని సహాయంతో దరిద్రాన్ని పోగ్గోట్టుకొని ఆనందమయ జీవితాన్ని గడపాలన్నదే ఈ సమేత అర్థం . 
                           కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
పరిమాణంలోను , ఖరీదు లోను  వంకాయ, గుమ్మడికాయ కంటే చాల చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడం ఏమంత సమజసం కాదు కదా! అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ సమేత పుట్టింది. 
                          గోరంత ఆలస్యం...కొండంత నష్టం
ఏ సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి చేసి తీరాలి. అలా చెయ్యని పక్షంలో నష్టం అనుభవించక తప్పదు. క్షణకాలం ఆలస్యం జరిగినా , చేరుకోవాల్సిన చోటుకు వెళ్ళలేక పోయిన తీవ్రంగా నష్టం ఎదురుకోవాలి. కబ్బతి సోమరితనాన్ని విదిపెట్టి చురుకుగా పనిచేయాలని చెప్పడమే ఈ సమేత అర్థం.

                       అందితే జుట్టు ...అందకపోతే కాళ్ళు
కొంతమంది యెప్పుదూ పక్కవారి పై తమదే పై చేయిగా ఉండాలని భావిస్తుంటారు . అందుకోసం అతితెలివిగా వ్యవహరిస్తుంటారు ,.ఎదుటివారి జుట్టు తమ చేతిలో ఉండాలన్నట్లు మాయోపాయాలను పన్నుతుంటారు . బెడిసి కొడితే కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు.వీరిని ఎట్టిపరిస్థితుల్లోను నమ్మకూడదు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.
                    కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి
పెద్దలు సంపాదించిన ఆస్తి ఎన్ని కోట్లు ఉన్న దాన్ని తింటూ  కూర్చుంటే చివరకు పైసా లేని స్థితి  వచ్చేస్తాం . అటువంటి దుస్థితి యెవరూ తెచ్చుకోకుడదు. కొండనైన ప్రథిరొజూ పగలగొట్టి రాళ్ళను తేసుకువేలుతు ఉంటె చివరకు ఒకనాడు కొండే కనిపించకుండా పోతుంది. మనిషికి సోమరితనం పనికిరాదని, ఏదో ఒక గురవప్రధమైన పనిచేసి సంపాదించాలని చెప్పడే ఈ సామెత. 

No comments:

Post a Comment