Saturday 28 May 2011

HealthTip(Wash your hands after taking money)

మనం ఉపయోగించే రూపాయలు మనకు వ్యాధిని కలుగచేస్తున్నాయి.ఇది అబద్ధం కాదు,నిజం అని చెబుతున్నారు మణిపాల్ యునివెర్సిటీ వాళ్ళు. ఆ యునివెర్సిటీ  వాళ్ళు చేసిన ఒక రిసెర్చ్   లో భాగంగా ఈ విషయం తేలింది.Coins ద్వారా 96 శాతం,కరెన్సీ నోట్ల ద్వారా 100 శాతం మేర వ్యాధులు వ్యాప్తి చెందే  అవకాశం ఉందంట. మూడు రాకాల bacteria లు   ముఖ్యంగా ఈ కరెన్సీ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. ఈ bacteria ల వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు,జీర్ణ వ్యవస్థకు సబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ bacteria లు ఏ మందుకు లొంగవని కూడా ఈ తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు ఒకరి దగర నుంచి డబ్బులు తిసుకున్నపుడు కచ్చితంగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి.లేకపోతే ఆ bacteria మీలో చేరే అవకాశం ఉంది.బి  కారేఫుల్

Why cat eyes are brighter in dark?

చీకటిలో పిల్లి కళ్ళు ఎందుకు మెరుస్తాయి?
చీకటిలో చురుగ్గా ఉండే పిల్లిలాంటి జంతువుల కళ్ళు చీకట్లో మెరవడానికి కారణం వాటి కళ్ళలో పరావర్తన సంబంధిత కణాలతో కూడిన  పొర ఉండడమే. వాటి కంటిలోని రెటినా వెనుక భాగంలో ఉండే ఈ పొరను 'తాపెటం లుసిడం  ' అంటారు.పిల్లి కళ్ళలో పడే అతి తక్కువ కాంతిని కూడా ఈ పొర పరావర్తనం చెందిస్తుంది.ఈ పొర మీద పడి పరావర్తనం చెందిన కాంతి దాన్ని రెటిన గుండా పయనించి బయటకు రావడం వల్లనే మనకు దాన్ని  కళ్ళు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి.ఈ పొర వల్లనే పిల్లి కళ్ళు సంగ్రహించే కాంతి పరిమాణం మిగతా జీవుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి చిక్కట్లో బాగా చూడగలవు. 

Ten crore books LIBRARY.

                    211 ఏళ్ళ చరిత్ర..10 కోట్ల పుస్తకాలు...
                    3 వేల మంది పైగా సిబ్భంది..అన్ని కలిస్తే...
                    ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంధాలయం.!
మీరు అపుడప్పుడు గ్రందాలయనికేల్లి పుస్తాకాలు చదువు కుంతారుగా ? మరైతే ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? అమెరికా రాజధాని వాషింగ్టన్ d c లో.. అమెరికా ప్రభుత్వం దిన్ని కేవలం 5000 డాలర్లతో  1800 లో ప్రారంభించింది.అంటే దీనికి ఏకంగా 211 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట..లైబ్రరీ అఫ్ కాంగ్రెస్  పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి.అంటే పుస్తకాలతో  పాటు CD లు,పురాతన పత్రాలు,మ్యాపులు,వీడియోలు ఇలాంటివన్నమాట,,కేవలం పుస్తకాల సంఖ్యే 10 ,90 ,29,769 ఈ   పుస్తకాలన్నీ  ఎంత స్థలాని ఆక్రమిస్తాయో తెలుసా ? వీటిని  పేర్చిన  అరలన్నీ  కలిపితే  1046 కిలోమీటర్ల  పొడవు  ఉంటాయి  గ్రంధాలయం నిర్వహణకు  3 ,597 మంది సిబ్భంది పనిచేస్తారు . అతి పెద్ద లైబ్రరీగా  గిన్నిస్  రికార్డ్  కుడా  పొందిన  దీనికి www.loc.gov అనే వెబ్సైటు  ఉంది. దిన్ని ప్రారంభించి  పన్నెండేల్లయిందో  లేదో  అమెరికా పై యుద్ధానికి  దిగిన  బ్రిటిష్  సేనలు  దిన్ట్లోని  విలువైన  పుస్తకాలను ఎత్తుకెళ్ళి గ్రంధాలయానికి నిప్పుపెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్ తాను సేకరించిన 6000 పుస్తకాలతో మల్లి దిన్ని ప్రారంభించారు.తరువాత క్రమంగా పుస్తకాల సంఖ్యా పెరుగుతూ వచ్చింది.ఇప్పుడది అత్యాధునిక సౌకర్యాలతో,కంప్యుటర్ పరిఘానంతో మూడు  విశాలమైన భవనాలలో కొలువుదిరింది. అన్ని రంగాల సమాచారాలతో సిద్ధంగా ఉండే ఇది అమెరికా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అమెరికా కాపీ రైట్   సంస్థగా కుడా పనిచేస్తుంది.ఎలాంటి సమాచారం కావాలన్న క్షణాల్లో దొరుకుతుంది.విబిన్న రంగాల పరిశోధనలకు కావాల్సిన విలువైన సమాచారం లభిస్తుంది.ప్రభుత్వానికి సమాచారం అందించే సంస్థగా కూడా పనిచేస్తుంది.
          మీకు తెలుసా?
 *470 భాషల పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఉన్నాయి.
 *526,378 చాపిరిఘ్ట్లు నమోదు అయాయి.
 *పాటకుల కోసం 20 విశాలమైన ఐదు వేదికలు ఉన్నాయి.
 *సినిమా ప్రదర్శనల కోసం ఒక దియేటర్ ఉంది.

How aroma comes from things?

కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది?
పదార్థాలు వివిధ భౌతిక ,రసాయనిక స్థితుల్లో ఉంటాయి.ఘన,ద్రవ,వాయు స్తితులతో పాటు,రసాయనికమగా రకరకాల అణు నిర్మానాలతో  ఉంటాయి. వాసన వచ్చే పదార్థాలకు ఆవిరయ్యే లక్షణం ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్నా,ద్రవ రూపంలో ఉన్న్న ఎంతోకొంత మేరకు సాధారణ ఉష్నోగ్రతల వద్దే ఆవిరవుతూ ఉంటాయి. ఆ ఆవిరిలో వాటి అణువులు ఉంటాయి . ఇవి మన నాసికా రంధ్రాలను చేరవేరినప్పుడు  మన ముక్కులోపలి తడి పొరల  మీద ఉన్న ఘ్రాణ నాడులు ప్రేరేపితమవుతాయి..అందుకనే వీటిని రసాయనిక గ్రహాకాలు అని కూడా అంటారు. ఇలా వివిధ పదార్థాల ఆవిరులలో వేర్వేరు అణువులు ఉండడం వళ్ళ ముక్కులోని నాడుల మీద వీటి ప్రభావం వాటి విలక్షనతతో  ఉంటుంది. వీటి వళ్ళ ప్రేరేపితంయ్యే నాడులు ఆయ విశిష్ట సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. వాటిని బట్టి మనం వేర్వేరు వాసనలను గుర్థుఇన్చగలుగుథాము.

Why we use Fuse?

అపుడప్పుడు ఫుసె పోయి విద్యుత్ ఆగిపోతు ఉంటుంది కదా?అసలు ఇది ఎందుకు ఉండాలి?
విద్యుత్తో పనిచేసే రెఫ్రిజిరేటర్  ,టివి, A C లాంటి పరికరాల గుండా విద్యుత్ ప్రవవాహం తీవ్రత ఎక్కువైతే అవి పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.ఒకోసారి ఇళ్ళలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి.ఇలా జరగకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసేవే ఫ్యూజ్ లు .విద్యుత్ సరఫరా కేంద్రం నుంచి మన ఇంటి లోపలి  వరకు వివిధ దశల్లో వీటిని అమరుస్తారు.విద్యుత్ ప్రవవాహం అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయ్యే సందర్భాల్లో ఫ్యూజ్ లో  అమర్చే తీగ చటుక్కున కరిగి పోయి విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.సాధారణంగా ఫ్యూజ్ తీగలను కొన్ని లోహాల మిశ్రమంలో చేస్తారు.దిని ధ్రవిభావన స్థానం (మెల్టింగ్ పాయింట్)తక్కువగా ఉంటుంది  కాబట్టి,విద్యుత్ ప్రవాహ తీవ్రత పెరిగినప్పుడు ఫ్యూజ్ తీగ వెడ్డికి కరిగిపోతుంది.అందువల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయి ప్రమాదాలు తప్పుతాయి.చాల మంది ఫ్యూజ్ తరుచుపోకుండా ఉండడానికి అందులో రాగి తీగలను మెలిపెట్టి వాడుతుంటారు. ఇది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాగలదు.