Wednesday 1 June 2011

Why difference in taste of water?

నీళ్ళలో తేడాలేంటి?
మాములుగా నీటికి మినెరల్ వాటర్ కి  తేడా ఏంటి?మినెరల్ వాటర్ ఎందుకంత రుచిగా ఉంటుంది ?

మాముల్గా మనం తాగే మంచినిటినితి,మినెరల్ వాటర్ కి  తేడా ఉండకూడదు.కాని మునిసిపాలిటి నుంచి మనకు సరఫరా అయ్యే నీరు ఒకోసారి వివిధ కారణాల వాళ్ళ తాగడానికి పూర్తిగా అనువుగా ఉండక పోవచ్చు..చెరువులు,ఆనకట్టలు,నదుల్లోంచి సేకరించి సుద్ధి చేసే ప్రక్రియలోనో, ఆ నీటిని సరఫరా చేసే క్రమంలోనో  అది కలుషితమయ్యే అవకాశం ఉండవచ్చు అలాంటపుడు ఆ నీటిని కాచి వడపోసుకొని తాగితే సరిపోతుంది. ఇక మినెరల్ వాటర్ ని సాధారణంగా బోర్ బావులుంచి సేకరించి అందులోని అదనపు లవణాలను రివర్స్ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా తొలగించి ,ఆపై అవసరమైన లవణాలను కలుపుతారు.తగుపాళ్ళలో అన్ని పదార్థాలు ఉండడం వాళ్ళ మినెరల్ వాటర్ కి ప్రత్యేక  రుచి చేకూరుతుంది.మినెరల్ అంటే లవణ పదార్థమని అర్థం. 

Saturday 28 May 2011

HealthTip(Wash your hands after taking money)

మనం ఉపయోగించే రూపాయలు మనకు వ్యాధిని కలుగచేస్తున్నాయి.ఇది అబద్ధం కాదు,నిజం అని చెబుతున్నారు మణిపాల్ యునివెర్సిటీ వాళ్ళు. ఆ యునివెర్సిటీ  వాళ్ళు చేసిన ఒక రిసెర్చ్   లో భాగంగా ఈ విషయం తేలింది.Coins ద్వారా 96 శాతం,కరెన్సీ నోట్ల ద్వారా 100 శాతం మేర వ్యాధులు వ్యాప్తి చెందే  అవకాశం ఉందంట. మూడు రాకాల bacteria లు   ముఖ్యంగా ఈ కరెన్సీ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. ఈ bacteria ల వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు,జీర్ణ వ్యవస్థకు సబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ bacteria లు ఏ మందుకు లొంగవని కూడా ఈ తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు ఒకరి దగర నుంచి డబ్బులు తిసుకున్నపుడు కచ్చితంగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి.లేకపోతే ఆ bacteria మీలో చేరే అవకాశం ఉంది.బి  కారేఫుల్

Why cat eyes are brighter in dark?

చీకటిలో పిల్లి కళ్ళు ఎందుకు మెరుస్తాయి?
చీకటిలో చురుగ్గా ఉండే పిల్లిలాంటి జంతువుల కళ్ళు చీకట్లో మెరవడానికి కారణం వాటి కళ్ళలో పరావర్తన సంబంధిత కణాలతో కూడిన  పొర ఉండడమే. వాటి కంటిలోని రెటినా వెనుక భాగంలో ఉండే ఈ పొరను 'తాపెటం లుసిడం  ' అంటారు.పిల్లి కళ్ళలో పడే అతి తక్కువ కాంతిని కూడా ఈ పొర పరావర్తనం చెందిస్తుంది.ఈ పొర మీద పడి పరావర్తనం చెందిన కాంతి దాన్ని రెటిన గుండా పయనించి బయటకు రావడం వల్లనే మనకు దాన్ని  కళ్ళు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి.ఈ పొర వల్లనే పిల్లి కళ్ళు సంగ్రహించే కాంతి పరిమాణం మిగతా జీవుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి చిక్కట్లో బాగా చూడగలవు.