Wednesday 30 March 2011

Telugu Kadha---Chavunu jayinche upaayam

చంద్రగిరి పరిపాలించే సత్యవర్మకి మరణాన్ని జయించాలనే కోరిక కలిగింది . మంత్రిని రప్పించి తన కోరిక బయటపెట్టాడు  . 
'ప్రభు ! ఈ విశ్వంలో నసిచనిధంటూ ఏది ఉండదని చెబుతారు . పుట్టిన ప్రతి జీవికి గిట్టక తప్పదు , అయితే ఇక్కడికి  వెయ్యి ఆమడాల దూరము లో దీపశిఖ అనే పురాతన కోటలో ఓ మంత్రసిద్ధుడు మరణాన్ని జయించాడని మా తాతగారు చెప్పేవారు ' అన్నాడు మంత్రి '
సత్యవర్మ అమితోస్చాహంగా , ' అయితే నేనే స్వయంగా వెళ్లి ఆయన్ని కలుసుకుంటాను . నేను వచ్చే వరకు రాజ్యభారం మీదే ' అంటూ అప్పటికప్పుడే బయల్దేరాడు . 
ఆరు నెలల పాటు ప్రయాణించిన రాజు సత్యవర్మ చివరికి ఎలాగైతేనేం , పురాతనమైన దీపశిఖ కోటను చేరుకున్నాడు.
శిధిలావస్థలో కూలిన గోడలతో పిచ్చి మొక్కలు పెరిగిపోయిన ఆ కోటలో తిరగసాగాడు .ఇంతలో సాలెగూల్లు ధట్టంగం అల్లుకున్న ఓ గదినుంచి , 'ఎవరు నువ్వు ?' అనే మాటలు వినిపించాయి 
'నేను చంద్రగిరి మహారాజు ను , మ్రుత్యున్జయుడిని వెదుకుతూ వచ్చాను ' అన్నాడు సత్యవర్మ  
'నువ్వు వెతుకున్నది నేనే ! నీ పిచ్చి ఆలోచన మానుకుని వెంటనే వచ్చిన దారినే వెళ్ళు ' అని గదిలోంచి వినిపించింది .
    'లేదు .... నేను మీలాగా మృత్యువును జయిస్తాను ' 
    'అయితే లోపలి రా '
     రాజు సత్యవర్మ ఉస్చహంగా లోపలికి వెళ్లి అక్కడే దృశ్యం చూసి నివ్వెరపోయాడు .
      అక్కడొక వృద్ధుడు ధూళిలో పడుకొని ఉన్నాడు. అతడి జుట్టు గడ్డం చాల దూరం పెరిగిపోయి ఉన్నాయి .గోళ్ళు మెలితిరిగిపోయి కనిపించాయి . అతడి శరిరం పూర్తిగా  సుష్కించిపోయి చర్మం ఎముకలకు అతికించినట్టు ఉన్నది. 
'ప్రకృతి విరుద్ధమైన కోరికతో మంత్రోపాసన చేసి చావును జయించగాలిగాను కాని, శారిర సహజమైన ముసలితనాన్ని అడ్డుకోలేకపోయాను . కనీసం కదలడానికి కుడా ఓపిక లేని నా దుస్తుతిని కావాలంటే నీకు కుడా మంత్రం ఉపదేసితాను ' అన్నాడు మృత్యుంజయుడు .
              రాజు సత్యవర్మ మారు మాట్లాడకుండా అక్కడ నుంచి బయల్దేరి తిరిగి కోటకు చేరుకున్నాడు .
 
 

Telugu Kadha--Paayasam yela undaali

చిలకా గోరింక పెళ్లి చేసుకున్నాయి . కాపురం పెట్టాలంటే ,ఇల్లు కావాలి కదా ? అది కాకమ్మ ఇంటికి వెళ్ళాయి. 'నీ ఇల్లు పెద్దది కదా ? మాకొక వాత ఇస్తావా ?' అని అడిగాయి .
కాకమ్మ సరేనంది . చిలకా గోరింకా ఓ వాటాలో చేరాయి  . ముచ్చటైన ఆ జంటను చూసి , కాకమ్మ ఓర్వలేక పోయింది . కళ్ళలో నిప్పులు పోసుకోసాగింది . తన కుళ్ళు భోతు తనాన్ని గుండెల్లో దాచుకుని ,పైకి మాత్రం తియ్యగా మాట్లాడేది . గోరింకకు కాకమ్మ అంతరంగం కొద్దికొద్దిగా అర్ధంకాసాగింది . కాకమ్మతో స్నేహం చనువు తగ్గించమని చిలకమ్మకు పదేపదే చెప్పసాగింది . చిలక పట్టించుకోలేదు . ' అల అన్తావెం మామా? కాకమ్మ పిన్ని ఎంత మంచితో తెలుసా? ' అంటుండేది . 
ఒకనాడు 'మరదలా? ఈ రోజు పడగకద ? మధ్యానం నేను వెచ్చేసరికి సేమ్యా పాయసం వండి పెట్టు ' అని పెళ్ళాంతో 
చెప్పి గోరింక బయటికి వెళ్ళింది . చిలకమ్మకు దిగులుజ్ పట్టుకుంది . పాయసం ఎలా వండాలో తనకు తెలియదు . తానెపుడు తినలేదు కుడా . తన తల్లి తనకు నేర్పలేదు . 
'దిగులేందుకే పిచ్చిపిల్లా! పాయసం ఎలా చేయాలో నీకు నేను చెపుతాను కదా ? అంటూ  కాకమ్మ దారియం చెప్పింది. 'పొయ్యి మీద బాణలి పెట్టు . జీడిపప్పు , కిస్స్మిస్స్ దోరగా వేయించుకుని పక్కకు తీసి ఉంచుకో , భానలిలో రెండు గిన్నెల ఉప్పు వేసి బాగా కలుపు ,సేమ్యా ఉడికాక గిన్నెడు చెక్కర దాని మీద చల్లి , బాణలి దించుకో , నోరూరించే పాయసం రెడీ . !'

చిలకమ్మ మురిసిపోయింది . భర్త వచ్చేలూగా, కూని రాగాలు తీస్తూ ,పాయసం సిద్ధం చేసింది , గోరింక ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుంది . గోరింక తన పెళ్ళాన్ని చావా భాదుతుంటే పండగ చేసుకుందామని దాని ఆశ ! 
అయితే , కాకమ్మ ఆశించినట్లే జరగలేదు . గోరింక పాయసం గుట గుటా తాగేసింది . ' ఆహ ! ఓహో ! ఎంత బాగా చేసావు ఇలాంటి పయాసం నేనెపుడు తాగలేదు సుమా!' అంటూ మెచ్చుకుంది . నోరు తుడుచుకుంటూ బయటకు వచ్చింది .చాటున నిలబడి , అది కాకమ్మను చూసి , ' నా పెళ్ళాం తన చేతిలో నాకేమిచ్చినా , అది అమ్రుతంగానే ఉంటుంది అని తెలియదా అత్హ ?' అంటూ నవ్వింది . కాకమ్మ ముఖం మాడిపోయింది . 
'నేను చేసిన పాయసం అంత బాగుందా?' అని సంబరపడిపోతూ , చిలక పయాసం నోట బెట్టుకుంది . తుపుక్కున ఉమ్మేసింది . కాకమ్మ దుర్బుద్ధి దానికి తెలిసిపోయింది , 'పాయసం ,చండాలంగా ఉందంటే పెళ్లమేక్కడ నోచ్చుకుంట్టుందో  అని మేచుకుంటూ తిన్నాడు నా మొగుడు , అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది .
'మామా ! మనం ఇక్కడ వద్దు , తెల్లవారగానే మరో చోటుకి వెళ్లి పోదాము ' అని వాత కాలి  అయిపోయింది .


 

Sunday 27 March 2011

Telugu Motivations and Inspirational Quotes

         పంతంతో పనిచేయి ,విజయం పరుగేడుతుకుంటూ వస్తుంది .
                                                ---------సర్దార్ వల్లభై  పటేల్
       panthamtho panicheyi, vijayam parugeduthukuntu vasthundhi.
                                              ----Sardhar VallaBhai Patel

         అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది . అలాగే దుఖం తరువాత వచ్చిన       సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది. 
                                               ------- సూధ్రక మహాకవి
   andhakaaram tharuvatha vacchina velugu amithamaina annadhaanni isthundhi.Alaage dhukham tharuvatha vacchina sukham amitha santhoshaanni isthundhi.
                                       ------Sudhraka MahaKavi

        ఇతరులపై మనం కరుణ చూపకుండా  , మనల్ని కరుణగా చూడమని   దేవుని ప్రార్థించడం అన్యాయం 
                                                -----గాంధీ
   Itharulapai Manam Karuna Chupakunda,manalni karunaga chudamani dhevuni prarthinchadam anyaayam.
                                             ------Gandhi


           సాహాసికులనే అదృష్టం వరిస్తుంది 
                                            ------నేపోలేయన్
           Sahaasikulane adhrustam varisthundhi.
                                            -----Nepolean



           అవినీతికి పాల్పడిన వారికి చివరికి మిగిలేది ఆవేదన , అవమానాలే 
                                           ------సి . సిమ్మన్
         Avineethiki paalpadina vaariki chivariki migiledhi aavedhana, Avamaanale.
                                          ------C.Simmon



           కళాకారుడు ఏ వస్తువుని యధాతధంగా చూడడు  .తన ద్రుక్పధం నుంచే చూస్తాడు 
                                          -----అల్ఫ్రెడ్
        kallakaarudu ye vasthuvuni  yedhathadhamga chudadu. Thana dhrukpadham nunche chusthaadu.
                                        ----Alfred



          తల్లి , తండ్రి ,గురువులను పుజ్యానియులుగా  చూడడం మన కనీస ధర్మం. 
                                         ----- confucious 
        Thalli ,Thandri,Guruvulanu pujyaaniyuluga chudadam mana kanisa dharmam.
                                     ---- confucious


శాంతి లోపల నుంచే జనిస్తుంది , దాని కోసం బయట వెతకొద్దు . 
                                         ------ బుద్ధుడు
Shaanthi lopala nunche janisthundhi, Dhaani kosam bayata vethakavaddhu.
                                       -----Budhudu



          పెద్ద నౌక  నది సముద్రంలోకి పోవచ్చు , కాని చిన్న నావలో తీరం వెంబడే పయనిచాలి .
                                      ------ బెంజమిన్ ఫ్రాన్క్లిన్
         Peddha Nouka nadhi samudhramloki povacchu, kaani chinna naavalo thiram vembade payanichaali.
                                  ------Benjamin Franklin

         చిన్న చిన్న విషయాలు గురించి తీవ్రంగా అలోచించే  వారు పెద్ద పెద్ద విషయాల గురించి అలోచించలేరు  . 
                                     -----లారో షేపో కాల్డ్
        Chinna Chinna vishyaalu gurinchi thivramga alochinche vaaru peddha peddha vishayaala gurinchi alochinchaleru.
                                    ----LaroShepo Called.





          చేసిన తప్పును సమర్థించుకోదానికి ప్రయత్నిచకు . మంచిని పెంచుకుంటే తప్పులు తొలగిపోతాయి   
                                       ---స్వామి వివేకానంద
       Chesina thappunu samardhichinkovadam prayathnichaku.Manchini penchukunte thappulu tholigipothaayi/
                                     -----Swami Vivekanandha



         భయాన్ని అధిగమించడం జ్ఞాన సముపార్తనకు తొలి మెట్టు   .
                                       ----- రస్సెల్
        Bayaanni Adhigaminchadam ghnana samupaarthanaku tholi mettu.
                                     ------Russell

        నీ భాధకు కారణం ఏమైనా కావచ్చు  కాని అ కారణం తో ఇతరులను మాత్రం హాని చేయకు .
                                      ---- బుద్ధుడు
       Nee Badhaku kaaranam yemaina kaavacchu, Kaani ah kaaranamtho itharulanu maathram haani cheyaku.
                                     ---Buddhudu



        వినడంలో తొందరపడాలి  కాని మాట్లాడటంలో తొందర పడకూడదు . 
                                      ---- జేమ్స్
        Vinadamlo thondharapadaali kaani maatladatamlo thondhara padakudadhu.
                                      ----James



        మీ మనసు నియత్రించండి . మీ ముందున్న అతి పెద్ద సవాలు అదే . మీ మనస్సును అదుపులో పెట్టుకుంటే సంతోషం అవలీలగా దక్కుతుంది  
                                   ------ బౌద్ధం
     Mee manasu niyathrinchandi mee mundhunna athi peddha savaalu adhe. Mee manasunu adhupulo pettukunte santhosham avaleelaga dhakkuthundhi.
                                 ------Bauddham



       ప్రపంచం మసగ్గా కనిపిస్తున్న కాంతిమంతంగా కనిపించినా అంత నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది . 
                                 ------ క్లిజర్
     Prapanchamlo masagga kanipisthunna kaanthimanthamga kanipinchinaa antha nee alochana meedhe aadhaarapadi untundhi.
                                 -----Klizar



       ప్రపంచంలో కత్తి , కలం రెండింటికే అధికారలున్నాయి , ఎప్పుడు చివరకు కత్తి పై కాలమే విజయం సాధిస్తుంది . 
                                   -----నేపోలేయన్
     Prapanchamlo katthi, kalam renditike adhikaaralunnayi. yepuddu chivaraku katthi pai kalame vijayam saadhisthundhi.
                                 -----Nepolean

        ముగ్గురే ముగ్గురు ఉత్తమ వైధ్యులున్నారు 
                   1 ) నియమిత ఆహరం 
                   2 ) ప్రశాంతత చిత్తం 
                  3 ) ఉత్స్చాహం 
                      ------- సిడ్నీ స్మిత్
       Muggure mugguru utthama vaidhyulunnaru
                1)Niyamitha aaharam
                2)Prashaanthatha chittham
                3)Uschaham
                      -------Sydney Smith



          ఓటమి నిరాశకు కారణం కాకూడదు , కొత్త ప్రేరణకు నాంది పలకాలి .
                       ------ లింకన్ 
         Otami niraasaku kaaranam kaakudadhu,Kothha preranaku naandhi palakaali.
                       ---Lincoln

       మంచి స్నేహితున్ని కలిగి ఉండే ఏకైక మార్గం మంచి స్నేహితుడిగా ఉంచడమే 
                        ---- ఎమెర్సన్
      Manchi Snehithunni kaligi unde maargam manchi snehithudiga unchadame.
                       ----Emerson

       రాజకీయాల్లో , యుద్ధాల్లో , వ్యాపారాల్లో ఆ మాటకొస్తే అన్ని విషయాల్లోనూ ఏకాగ్రతే నిజమైన బలం .
                            ----- ఎమెర్సన్ ఆర్
      Raajakiyaallo ,,Yuddhaallo ,vyaapaarallo aa maatakosthe anni vishyaallonu yekaagrathe nijamaina balam.
                           ----Emerson. R



       మేధావులు మాట్లాడుతారు ,మూర్ఖులు వాదిస్తారు .
                             ----కనఫ్యు షిఎస్
        Medhaavulu maatladuthaaru, murkhulu vaadhisthaaru.
                               ----Conficious


      విద్యార్థికి నిజమైన పాటయ గ్రంధం అతని ఉపాధ్యాయుడు .
                            --- గాంధీ
    Vidhyaarthiki Nijamaina Paataya Grandham Athani Upaadhyaayudu.
                            ---Gandhi

     డబ్బుకు లొంగని వ్యక్తికి అందరు ప్రసంసిస్తారు 
                             ----- సిసిరో
    Dabbuku longani Vyakthiki andharu prasamsistharu.
                             --C C Ro

    దారిద్ర్యం అసుకర్యకరమైనదే కాని అవమానకరమైనది కాదు 
                         --- సిడ్నీ స్మిత్
   Dhaaridhryam Asukaryakamainadhe Kaani Avamaanakaramainadhi Kaadhu.
                       ----Sydney Smith

    ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చ లేము . ప్రేమాభిమానాలతోనే చల్లార్చ గలం
                       ---- సర్వేపల్లె రాదా కృష్ణన్  
    Dhweshaanni Dhweshamtho Challarchelemu . Premaabimaanaalathone Challaarcha galam.
                     ----SarvePalle RadhaKrishnan

      శాంతి ని బలప్రయోగంతో సాధించలేము , సాధవగాహనతోనే సాధించగలం .
                        ---- ఆల్బర్ట్
        Shaanthi ablaprayogaalatho saadhinchalemu,saadavagahanathone Saadhinchalgalam.
                      ----Albert

       అన్ని రంగాల్లో ఏకాగ్రతే నిజమైన బలం 
                        --- ఎమెర్సన్
    Anni rangaallo yekagrathe nijamina balam.
                           ---Emerson
    ఒక విషయం మనకు క్స్తున్నంగా తెలిసినప్పుడే దాన్ని ఇతరులకు భోధచేయ్యాలి. 
                          ---- ఎడ్వర్డ్
   Oka Vishayam manaku klupthamga thelisinappude dhaanni itharulaku bhodhacheyyali.
                        ----Edward

     మెరుగు పెట్టకుండా రత్నానికి ,కస్టాలు ఎదుర్కోకుండా మనిషికి రాణింపు రాదూ .
                          ---- కాటో
      Merugu pettgakunda rathanaaniki,,kastaalu yedhurkokunda manishiki raanimpu raadhu.
                           ---Kaato
        ఎదుటి మనిషి భాదల పట్ల నిర్లిప్తంగా ఉండే వాడు హీనుడు . 
                          --- కార్ల్ మార్క్స్
       Yedhuti manishi Badhala patla nirlipthamga unde vaadu heenidu.
                        ---Karl Marx
      చెడుకు సహకరించక పోవటం పవిత్రమైన విధ్యుక్త ధర్మం . 
                         --గాంధీ
      Cheduku sahakarinchaka povatam pavithramaina vidhyuktha dharmama.
                       ---Gandhi
       జీవితం లో ఎన్నడు మిమల్ని మీరు తక్కువ చేసి  మాట్లాడకండి . 
                          --- కాంఫ్యు షియెస్  
       Jeevithamlo yennadu mimalni meeru thakkuva chesi maatladakandi.
                           ---Conficious

       చావడానికి సిద్ధపడే వాళ్ళ కన్నా విపత్తు లో పోరాడే వాళ్ళు నిజమైన ధైర్యవంతులు 
                        --- సింగల్ 
       Chavaadaaniki siddhapade vaalla kanna vipatthulo porade vaallu nijamaina dhairyavanthulu.
                      ----Singal

The Biggest____ Small World!

అతి పెద్ద .... బుల్లి ప్రపంచం 
                అదొక పెద్ద నగరం .... కోటలు , భవనాలు, కట్టడాలు ఇందులో వింతేమి లేదు కధూ ? కాని అవన్నీ మీ మొకాలంత ఎత్హుల్లో  ఉంటె ! అదే మరి ఇక్కడి విచిత్రం !  
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ముందు ద్వారక నగరం బుల్లిబుల్లి ఇళ్ళతో కనిపించిన దృశ్యం గుర్తుందా ! పోనీ గలివర్ కధ లో లిల్లిపుట్ నగరం గురించి తెలుసా ? అచ్చం అలాంటి నగరం ఒకటి స్పైన్ దేశంలోని బార్సిలోనాలో ఉంది. అక్కడికి వెళితే మీరే భారికాయుడైపోయిన భావన కలుగుతుంది . ఎందుకంటే అదొక సుక్ష్మ నగరం అన్నమాట . ఇంగ్లిష్లో దీన్ని మినీఎచర్  వరల్డ్ అంటారు.బార్సిలోనాలో ఉంది అదే ,పైగా ఇది ప్రపంచంలో అతి పెద్ద మినీఎచర్ వరల్డ్ గా గుర్తింపు పొదింది .
కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ లు పాటలు పాడుతుంటే నేపధ్యంలో భవనాలే కాదు రైళ్ళు , విమానాలు , ఓడలు  కుడా బుల్లి బుల్లి గా కనిపించిన దృశ్యాలు చూసే ఉంటారు . ఆ సన్నివేశాన్ని ఇలాంటి సుక్ష్మ నగరాలలోనే చిత్రికరిన్చారన్నమాట , నిజానికి ఇలాంటి బుజ్జి ప్రపంచాలు ప్రపంచంలో దాదాపు ౩౦ వరకు ఉన్నాయి .అక్కడన్నీ చిన్న చిన్న ఇల్లు , బుజ్జి కట్టడాలు ఉద్యనావనాలే కనిపిస్తాయి , బార్సిలోన దగ్గర కాతలునియా అనే పెద్ద నగరం ఉంది . ఆ నగరం సుక్ష్మ నమూనానె అక్కడ మినీఎచర్ పార్క్ లాగ రూపొందించారు , నగరం లో అన్ని ముఖ్యమైన కట్టడాలతో పాటు, ఆ దేశంలోని ప్రసిద్ధ  భావనలు, కోటలు కుడా అక్కడ 25 రెట్లు చిన్నవిగా కనివిందు చేస్తాయి , ప్రతి కట్టడం తాలుకు నిర్మాణ పటాలను బట్టి అత్యంత జాగ్రతలతో సుక్ష్మంగా తిర్చిదిదారు  , ఇది కళాకారులు చేసిన కనికట్టులా అనిపిస్తుంది , మోత్హం 150 కి పైగా బుజ్జి కట్టడాలు దీంట్లో ఉన్నాయి . 1983 లో ప్రారంభించిన ఇది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది .


 ఇలాంటి సుక్ష్మ ప్రపంచాల్లో మరొక ప్రసిద్ధమైనది ఇంగ్లాండ్ లోని టర్కీ లో ఉంది , ఇప్పుడక్కడ ఓ చలికాలం పండగ కుడా జరుగుతుంది. నాలుగు ఎకరాల స్థలం లో ఉన్న దీంట్లో మొత్తం 400 కు పైగా బుల్లి కట్టడాలున్నాయి. అతి ఎక్కువ కట్టడాలున్న మినిఎచార్ పార్కుగా దీనికి  రికార్డు ఉంది , ఇందులో వీధులు , వీధి దీపాలు , ఆట మైదానాలు , బస్సులు ,రైళ్ళు , విమానాలు , ఆఖరికి నదులు , జలపాతాలు , వంతెనలు సైతం బుల్లి బుల్లి గ కనిపించి అలరిస్తాయి . పైగా అవన్నీ కృతిమంగా కురిపించే మంచుతో  నిండిపోయి ఆకట్టుకుంటాయి . దిన్ని చూడడానికి దేశదేశాలు నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తారు . మరి ఇంత చిన్న కట్టడాలున్న పార్కుల్లో మనుషులేలా నడుస్తారు ? పర్యాటకులు నడవాడానికి ప్రత్యేకంగా పెద్ద రోడ్లు ఉంటాయి . పైగా అందరిని అలరించే బోలెడు ఆకర్షణలు కుడా.

Why-What-How---Why we cant see the things in fog?

Q )పొగమంచు గుండా అవతలి వైపు ప్రదేశాన్ని , వస్తువులను చూడలేము కదా , ఎందుకని ?
A )అతి సూక్శ్మ మైన నీటి బిందువులు చెల్లచెదురై గాలిలో తెలియాడుతున్నపుడు ఏర్పడే పరిస్థితి పొగమంచు అంటారు .నిజానికిది ఘనిభావించిన నీటి ఆవిరి వాళ్ళ నెలకు అతి దగ్గరగా ఏర్పడే మేఘం లాంటిది , వాతవరనంలోని ఉష్ణోగ్రతను బట్టి గాలి కొంత ఘనపరిమనమున్న నీటిని సోశిస్తుంది , గాలి గరిస్తంగంగా సోశించే నీరు ఒక ఘనపు మీతెర్కు ౩౦ గ్రాముల వరకే . అంత కన్నా ఎక్కువ నీరు గాలిలో ఆవిరి రూపంలో కలిసినా, గాలి ఉష్ణోగ్రత తటాలున పడిపోయిన అది తేమను నీటి రూపంలో పోగామంచులోని సూక్ష్మ మైన  నీటి బిందువులు ఆ ప్రదేశంలోని ప్రతి వస్తువుపై ఒక కాంతి నిరోధక తెరలాగా పనిచేస్తాయి . దాంతో మన కంటికి కనిపించే సామర్థ్యానికి అంతరాయం కలుగుతుంది . వెయ్యి మీటర్ల పరిధిలోని వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే అది పొగమంచు ప్రభావమే .

Why-What-How(ఎంధుకు -ఏమిటి -ఎలా )--How the tissue paper absorbs water?

Q)హోటల్స్ లో చేతులు తుడుచుకోవడానికి  మెత్తని కాగితాన్ని ఇస్తారు. దాన్ని ప్రత్యేకత ఏమిటి ? అది నీటిని తొందరగా  ఎలా పీల్చుకుంటుంది ?
A)ఇలాంటి కాగితాని tissue   పేపర్ అని , కాగిత రుమాలు అని అంటారు . కాగితాలను సెల్లులోజ్    పాదార్తంతో  చేస్తారని తెలుసుగా ? మామూలు కాగితంలో ఈ పాదర్తపు పోగులు దట్టంగా అల్లుకొని ఉంటాయి . పైగా అధిక ఉష్ణోగ్రత వద్ద రోల్లెర్ల సాయంతో నొక్కుతూ తయారు చేయడం వాళ్ళ సెల్లులోజ్ పోగుల్ని పిండిపాధార్థం జిగురులాగా అతుక్కుని ఉంచుతుంది , అందువల్ల సాధారణ కాగితం గట్టిగ , నీరు తొందరగా ఇంకని విధంగా తాయారు అవుతుంది , అయితే tissue   పేపర్ లో సెల్లులోజ్ పోగుల్ని చాల వదులుగా ఉండేలా తయారు చేస్తారు , వీటిని కలిపి ఉంచడానికి పిందిపాధార్తపు వాడరు , అందువల్ల పొరకు, పొరకు మధ్య , చాల ఖాళీలు ఎక్కువగా సూక్శ్మస్థాయిలొ ఉంటాయి , ఈ కారణంగ ఇవి తడిని ఎక్కువగా పీలుచుకొగలుగుతాయి


Why-What-How---What is the usage of Invar steel?

Q)ఇన్ వార్ స్టీల్ అంటే ఏమిటి ?దాని ప్రయోజనాలు  ఏమిటి ?

A)ఈ రోజుల్లో  ఎలక్ట్రాని వాట్చేస్, బట్టేరి క్లోక్స్ వస్తున్నాయి కాని , అంతకు ముందు స్ప్రింగ్ లు , లోలకాలతో తయారయ్యే గడియారాలు ఉండేవి , వీటి లోపలి భాగాలను లోహాలతో తయారు చేయడం వల్ల , పరిసరాల ఉష్ణోగ్రతల్లో తేడాలు వల్ల ఇవి వ్యాకోచిన్చడమో,సంకోచిన్చడమో జరిగేది . ఫలితంగా అవి చూపించే సమయాలు కచ్చితంగా ఉండేవి కావు . ఒకో రుతువులో ఒకోల ఉండేవి . అలాగే దురాన్ని కొలిచే టేపుల కుడా ఇనుము , స్టీలు లోహాలతో చేయడం వల్ల సంకోచవ్యాకొచాల  కారణంగా కొలతలు మారుతుండేవి , అందువల్ల ఉష్ణోగ్రత మార్పులకు పెద్దగా ప్రభావితం కానీ లోహం కోసం అన్వేషించారు . అదే ఇన్ వార్ స్టీల్ . దిన్ని స్టీల్, నికెల్  64 : 36లను నిష్పతి లో మిశ్రమించి తాయారు చేస్తారు .

Why-What-How---why monkeys still alive?

Q) కోతి నుంచి మానవుడు ఉద్భవిస్తే , మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు ?

అ)     మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దాని అర్థం కోతులాంటి జీవులు పరిమాణం చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే . ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకల మారడం లాంటి జీవిత చక్రం కాదు . మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి కాని కాండం అంతరించి పోదు కదా ? జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం , కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్ళు తినడం , కొన్ని పరికరాలను సులువుగా వాడగల్గడం లాటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిమాణంలో క్రమేనా అలవడ్డాయి . అవే చింపాంజీలు , ఉరాన్గుటాన్ లు , గోర్రిల్లాలు లాంటి తోక లేని కోతి గ మారాయి . వాటి నుంచి క్రమేనా మానవజాతి పరిమాణం చెందింది . మనకు తల్లితండ్రుల పోలికలు ఉన్నా వాళ్ళు కుడా మనతోనే ఉంటారు కదా , అయితే తల్లితండ్రుల కన్నా మనం పరిమానాత్మకంగా కొంత మెర్రుగా ఉంటాము , ఏ జీవ జాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి నాలుగు కాలాల పాటు నిలదోక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది , తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి , శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పినట్లు ప్రక్రుతివరణమే జాతుల ఆవిర్భావానికి ఆస్కారం కలిగించింది.
 

Bhalaa! kesav Thabala --child kesav got appraisals from President

 *  60 వేల మంది చేత చప్పట్లు కొట్టించాడు
*రాష్ట్రపతి ప్రసంసలు అందుకున్నాడు ...
*బ్రిటిన్ యువరాజు మన్ననలు పొందాడు
*ఒక్క ప్రదర్శనలో లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ....అతడే ఏడేళ్ళ కేశవ్
ఓ   పక్క వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వెయ్యి మంది  డ్రమ్మరులు  పక్క ప్రదర్శనలో నిమగ్నమై ఉన్న కళాకారులు .. ఎదురుగా వేలాది మంది ప్రేక్షకులు..... మధ్యలో ఏడేళ్ళ బుడతడు ! ఉంగరాల జుట్టు ఉగు లాడేలా   తల ఉపుతూ  , ఆనందంగా నవ్వుతు అతగాడు తబలపై లయబద్ధంగా పలికించిన విన్యాసాలకు ఢిల్లీ లోని జవహర్ లాల్ స్టేడియం మొత్తం అబ్భురపదిపోయింది . కామన్ వేఅల్త్ గేమ్స్ ప్రారంభ వేడుకల్లో ఆ స్టేడియం లో  వారిని కాదు, టీవీ లు చుసిన లక్షలాది మంది వీక్షకుల్ని కుడా మైమరిపించిన కేశవ్ ఇప్పుడు దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించాడు.
 కేశవ్ వాళ్ళ సొంతుఉరు కేధ్రపాలిత ప్రాంతంమైన పుదుచేర్రి లో  ఆరోవిల్లె . ఇతని తాతగారు చిత్రకారుడు , తల్లి గోపిక గాయని ,ఫోతోగ్రఫేర్ , చిత్రకారిణి, కేశవ్ సోదరి కామాక్షి పియానో వాయిస్తుంది , కుటుంభం తో ఏదైనా ప్రధర్శానికి వెళ్ళిన , టీవీ లలో చుసిన అచ్చం అలానే వాయించడానికి ప్రయతిన్చేవాడు . మూడు  ఏళ్ళ  వయసులో అతడికి తభాల పరిచయమైంది . నాలుగేళ్ల పాటు సరదాగా సాధన చేసాడు . అందుకే కామన్ వేఅల్త్  గేమ్స్ ప్రారంభోస్తవాలకు ఎంపిక అయాడు  . ఆ ప్రదర్శన కోసం నేల్లాల్లపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందాడు . వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వెయ్యి మంది కళాకారులు డ్రమ్ముల  పై వాయిస్తుంటే , ఆ శబ్దాలకు అనుగుణంగా ఎక్కడ తడబడకుండా కేశవ్ ఎలా తబలా వాయిన్చాడో టీవీ లో చూసే ఉంటారుగా ? రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ ' శెభాష్ కేశవ్' అని ప్రశంసించారు .బ్రిటిన్ యువరాజు చార్లెస్ సైతం అభినందించారు. 
       ప్రముక తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ పోలికలు ఉండడంతో స్టేడియం లో వేల మంది ప్రేక్షకులు చప్పట్లు కొదుథూ, 'జునిఔర్ జాకీర్' అంటూ కేరింతలు కొట్టారు . కేశవ్ ఇంతకు ముందే ప్రదర్శనలు ఇచ్చాడు . అమెరికా , కెనడా లలో కుడా వేదికల పై మెరిసాడు .తబలతో పాటు గిటార్ కుడా వాయించే కేసవ్కు స్విమ్మింగ్ , సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టం

Sunday 20 March 2011

Rhymes for kids

God made the blue sky
And the deep sea too.
God made the green trees.
And the pretty flowers too.
God made the birds fly
And the fishes swim too.
But best of all He made me
To look just like Him.




My little pup can jump up high,he can also chase his tail.
He loves to fetch the ball eye throw and   he plays with me all day.


One two three four five
once i caught a fish alive
six seven eight nine ten
then i let it go again.
Why did u let it go 
because it bit my fingers so.
Which finger did it bite ?
                      The little finger on the right.
Bow Bow says the dog;
Mew,mew ,says the cat;
Grunt grunt goes the hog;
And squeak goes the rat ;
Tu-whu ,says the owl;
Caw,Caw says the crow;
Quack, quack says the duck;
And what the sparrow says, U know?

Raise your hands above your head,
Clap them one,two three,
Rest them know up on your hips,
Slowly bend your knees.
Up again and stand up tall,
Put your right foot out;
Shake your fingers.
Nod your head
And twist yourself about.



Cackle, Cackle mother goose,
Have you any feathers loose?
Truly have I,
Pretty fellow,
Half enough to fill a pillow.
Here are quills, 
take one or two,
And down
Enough to make a bed for you.




Medhaduku Padhunu (మెదడుకు పదును )--Brain tester

బోర్ కొడుతుందా? అయితే మీకు కాస్త రిలీఫ్ , అలాగే మెదడుకు పదును పెట్టె గేమ్ చెస్ . ఈ చెస్ ఆరో శాతాబ్దంలో భారతదేశంలోనే పుట్టింది .అంటే.. దాదాపు 1500 వ సంవచారంలో . అప్పుడు దినిని చతురంగ్ అని పిలిచే వారు . ఆ తరువాత చదరంగం , ఆంగ్లంలో చెస్ అని పిలుస్తారు . అయితే ఈ గేమ్ ప్రయాణం ఇక్కడి నుంచి పెర్షియా , అరబ్ దేశాలకు సాగింది. అక్కడ దిని సత్రంజ్ అని ముద్దుగా పిలిచేవారు . ఆ తరువాత 13 వ శతాబ్దంలో చదరంగం ఆట యూరోప్  దేశాల వరకు వెళ్ళింది. అయితే ఇందులో పావుల కదలికను , ఇంకా రూల్స్ ని ప్రవేశ పెట్టింది స్పైన్ (Spain) , ఇటలీ వాళ్ళు . ఈ ఆతని మొదట్లో ఇంట్లోనే ఆడుకునేవారు . మొట్టమొదటి సారి దినిని పోటిగా నిర్వహించింది 1886 లో .
ఆ తరువాత 21 వ శతాభ్దంలో కంప్యుటర్లో  కుడా ఆడే విధంగా ఈ ఆటను రూపొందించారు . ఈ ఆట ఆడడం ఈజీ . కాని దీంట్లో చాంపియెన్  అవ్వాలంటే మాత్రం మెదడుకు పదును పెట్టాలిసిందే .

Interesting Facts written in Telugu -2




ఏ జంతువైన కట్టెలు తినడానికి ఇష్టపడదు. కాని దుప్పి మాత్రం ఎంతో ఇష్టంగా వీటిని తింటుంది . ఎందుకంటే వాటివల్లే దాని శరీరం లోని ద్రవాలు వేడిగా ఉండగలుగుతాయి .



 
పిల్లి దాదాపు ౩౦ అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ సురక్షితంగా ఉండగలదు . అంతే కాదు , ఇది గంటకు 20 కిలో మీటర్ల దూరం పరుగెత్తగలదు .
.


నీటి ఏనుగు చూడడానికి అంత భారి ఆకారంలో ఉన్నప్పటికీ మనిషి కంటే వేగంగా పరిగెత్తగలదు 

 
 




మనిషిలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది . దీనిని స్టేపిస్ అంటారు 






 
భూమి పై ఉన్న ప్రధాన ములకాలలో,, ఆక్షిజన్ (47 శాతం),సిలికాన్(28 శాతం) , అల్యుమినం(8 శాతం) ఉన్నాయి. 


గొర్రెలకు నాలుగు ఉధరాలుంటాయి. అవన్నీ కూడా తిన్న ఆహారం సక్రమంగా జీర్నమఎందుకు తోడ్పడుతాయి.


                                           
సుర్యుడిపై ఉండే ఉష్ణోగ్రత కోటి యాభై లక్షల డిగ్రీల సెల్సియస్  కన్నా ఎక్కువ.  

 వడ్రంగి పిట్ట ముక్కుతో పొడిస్తే ఎంతటి బలమైన చేట్టుకైన తోర్రపడాల్సిందే.ఇదే సెకనుకు 20 సార్లు ముక్కుతో చెట్టును పొడుస్తుంది. మరి అంత బాలతో పొడిచినపుడు దాని ముక్కు,తలకి నొప్పిరాద? అని అనుకుంటున్నారా... అలా రాకుండా దీని మెదడులో కుషన్లాంటి నిర్మాణం ఉంటుంది.అంటే మన వాహనాలకు షాక్ అబ్సోర్బెర్స్ ఉన్నట్లు.


                    
చాలా రాకల పాముల్లో ఎదుగుదల  ప్రక్రియ ఎపుడ్డు కొనసాగుతూనే ఉంటుంది. అవి తమ చర్మాన్ని ఎపటికప్పుడు  విదిచిపెత్తడమే అందుకు కారణం.
                       
కరిసే కుక్క మొరగదు అంటారు కదా ! ఆ సంగతేమో కాని కుక్కల్లో అసలే మొరగని కుక్క ఒకటుంది అదే బాసేంజి 
                         
కంగారు దాదాపు 45 అడుగుల ఎత్తు వరకు ఎగురగలదు ,అయితే దూకడానికి ,ఎగరడానికి దీనికి శక్తేమి అవసరం లేదు.

                      
మొట్టమొదటి సారి ఆవిరితో నడిచే రైలును కనిపెట్టింది రాబర్ట్ స్తేఫెన్సన్ ,హ రైలు పేరు రాకెట్. 

భూమి గుండ్రంగా ఉంటుందని తెలుసు. కాని నిజానికి భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో కొంచెం లావుగా ఉంటుంది.

కాఫీ లో చెక్కర కలుపుకోవడం 1715 లో మొదలయింది ,దేనిని మొదలు పెట్టింది ఫ్రెంచ్ మోనార్క్ కింగ్ లూయిస్-14 


                                            గురక ,కల ఒకే సమయంలో రావు, పెద్ద కళలు తెల్లవారు జామునే వస్తాయి. ఒక మనిషికి సంవస్చారానికి 1460 కళలు వస్తాయి.  


           
వెనుకకు ఎగరగల ఏకైక పక్షి హుమ్మింగ్ బర్డ్,దీని గుండె నిమశానికి 615 సార్లు కొట్టుకుంటుంది.
                ఎక్కువ సమయం కంప్యూటర్  ముందు గడిపారా? అయితే వెంటనే ఒకసారి తలతలలాడే తెల్లకాగితాన్ని చుడండి.అది పింక్ కలోర్లో కనిపిస్తుంది. 

పావురాలు అతినీల లోహిత కాంతిని చూడగలవు.

పాములు కళ్ళు ముసుకున్నప్పటికి కనురెప్పల ద్వారా దృశ్యాలను చూడగలవు.
 


Manchi palukulu-- మంచి పలుకులు-Telugu Inspiration Messages

గతంలో ఉండిపోకు . రేపటి గురించి ఆలోచించకు . వర్తమానం నుంచి ధ్యాస మల్లించకు .
                                                  ------  బుద్ధుడు 

పుస్తాకాలు మనతో ఉంటే నరకంలో నైన ఉండగలం . వాటిలో స్వర్గాన్ని సాక్షాత్కరింప చేసే అద్భుతం శక్తిలున్నాయి
                                    ----బాలగంగాధర్ తిలక్  
పూల పరిమళం గాలివాటుకె వెళుతుంది . కాని మంచితనం ప్రతి ధిక్కుకూ ప్రస్తరిస్తుంది .
                                                  ------చాణక్యుడు 
ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వు . అదే వారికి నివ్విచే  అందమైన బహుమతి .
                                                 -----మదర్ దెరిస్సా
అవకాశాలు ఒకరిచ్చేవి  కావు.  మనమే వాటికి కృషి చేయాలి 
                                                        ---ఇందిరాగాంధి  
తోటివారితో మంచిగా జీవించు . నీ మంచి తనాన్ని  తోటి వారికి పంచు . అదే నిన్ను ఎల్లప్పుడు కాపాడుతుంది .
                                                       -----టాల్ స్టాయ్ 
నీవు ఎవరికైన ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు . ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మరిచిపోకు . 
                                                      -------ఎమెర్సన్ 
పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది . ఆత్మవిశ్వాసం మనిషిని విజయపధం వైపు నడిపిస్తుంది.
                                                     ------స్వామి వివేకానంద   


                                                          . 
  






Saturday 19 March 2011

Telugu Proverbs--తెలుగు సామెతలు

                              శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు 
మనిషి కష్టకాలంలో క్రున్గిపోకుడదు. అలాంటి సమయంలో ధైర్యంతో నిలబడి సమస్యలను ఎదుర్కోవాలి.కష్టం కలిగినపుడు దానికి కలిగిన కారణాలేంటో తెలుసుకోవాలి. దానివల్ల ఆ కస్టాలు మనకు దురమవుతాయి. అంతేగాని దేనితోనో , ఎవరితోనో  పోల్చకోకుడదు . అలా చేస్తే భాదే తప్ప ఇంకా ఏమి మిగలదు. కస్టాలు కలిగినపుడు అంతకు పదిరెట్లు ఉపాయాలు ఉండనే ఉంటాయి. ఆ ఉపాయాన్ని అలోచించి దాని సహాయంతో దరిద్రాన్ని పోగ్గోట్టుకొని ఆనందమయ జీవితాన్ని గడపాలన్నదే ఈ సమేత అర్థం . 
                           కొన్నది వంకాయ..కొసరింది గుమ్మదికాయన్నట్లు
పరిమాణంలోను , ఖరీదు లోను  వంకాయ, గుమ్మడికాయ కంటే చాల చిన్నది.వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మడికాయను ఇవ్వమంటే ఎలా? అలాగే కొంతమంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు వందరెట్లు అధికంగా, లేదా ఉచితంగా ఏదైనా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుంటారు. అలా తక్కువ పని చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడం ఏమంత సమజసం కాదు కదా! అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ సమేత పుట్టింది. 
                          గోరంత ఆలస్యం...కొండంత నష్టం
ఏ సమయానికి చేయాల్సిన పనులను ఆ సమయానికి చేసి తీరాలి. అలా చెయ్యని పక్షంలో నష్టం అనుభవించక తప్పదు. క్షణకాలం ఆలస్యం జరిగినా , చేరుకోవాల్సిన చోటుకు వెళ్ళలేక పోయిన తీవ్రంగా నష్టం ఎదురుకోవాలి. కబ్బతి సోమరితనాన్ని విదిపెట్టి చురుకుగా పనిచేయాలని చెప్పడమే ఈ సమేత అర్థం.

                       అందితే జుట్టు ...అందకపోతే కాళ్ళు
కొంతమంది యెప్పుదూ పక్కవారి పై తమదే పై చేయిగా ఉండాలని భావిస్తుంటారు . అందుకోసం అతితెలివిగా వ్యవహరిస్తుంటారు ,.ఎదుటివారి జుట్టు తమ చేతిలో ఉండాలన్నట్లు మాయోపాయాలను పన్నుతుంటారు . బెడిసి కొడితే కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు.వీరిని ఎట్టిపరిస్థితుల్లోను నమ్మకూడదు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు.
                    కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి
పెద్దలు సంపాదించిన ఆస్తి ఎన్ని కోట్లు ఉన్న దాన్ని తింటూ  కూర్చుంటే చివరకు పైసా లేని స్థితి  వచ్చేస్తాం . అటువంటి దుస్థితి యెవరూ తెచ్చుకోకుడదు. కొండనైన ప్రథిరొజూ పగలగొట్టి రాళ్ళను తేసుకువేలుతు ఉంటె చివరకు ఒకనాడు కొండే కనిపించకుండా పోతుంది. మనిషికి సోమరితనం పనికిరాదని, ఏదో ఒక గురవప్రధమైన పనిచేసి సంపాదించాలని చెప్పడే ఈ సామెత. 

Republic day in LIMCA Book

On  26th january,2011 republic day in Red Fort, Delhi,India,one awesome stunt attracted allover the India which were done by Indian soldiers. Daredevils group did a amazing bike riding stunt ,and this stunt won the world record.The stunt is -35 soldiers are in pyramid shapes on single motorbike and this stunt took place in LIMCA book of  records.From 1965 onwards this group is participating in Republic celebrations.Previously this group won five times world record,this time also they won the record.

World'a First Rotating Building,



                                                                       
మనము ఉండే ఇల్లు ఎక్కడైనా తిరుగుతుందా ? లేదు కదా ! కానీ బ్రసిల్ (Brazil)లోని ఈ భవనం మాత్రం రంగుళరాట్నంలా తిరుగుతూనే ఉంటుంది ఆది కుడా  360 డెగ్రీల కోణంలో . ఈ భవనం లో మొత్తం 11 ఆపార్ట్‌మెంట్ లు ఉన్నాయి . ప్రతి ఆపార్ట్‌మెంట్ కుడా ఒక్కో దిశలో తిరుగుతూ ఉంటుంది . ఒక్క చుట్టూ చుట్టడానికి ధాధాపు గంట సమయం పడుతుంది .ఐతే ఒక వేల మనం ఎక్కువ స్పీడు లో తిరగాలి అనుకుంటే మాత్రం కింద కంట్రోల్ ప్యానల్ వాలకి చెపితే సరి . ఇక ఈ భవనం లో ఓ ఫ్లాట్ కోనాలనుకుంటే మాత్రం డాలర్ 300,000లు చెల్లించాలిన్సిందే


Have you ever seen the rotating building?i think you haven't!! but the rotaing building is located in brazil country.This building is rotating 360 degrees and in this building consists of 11 apartments.This building takes one hour to rotate
completely.We have the facility to rotate much faster.Under the building,rotation control panel is there.The cost of each apartment is around 300,000 US dollars.Much costly huh?

Akio Morita(industrialist) ,(కృషితో కోట్లు)



పారిశ్రామిక ప్రపంచంలో ఆకియో మోరీట  గురించి తెలియని వారెవరు ఉండరు .ఎవరబ్బా ? అని ఆలోచిస్తున్నారా .. ! ఎలెక్ట్రానిక్ ఉత్పతుల తయారీలో మేటి కంపనీ అయిన సోనీ కార్పొరేషన్ స్థాపకుడు . సోనీ నుంచి వెలువడిన మొట్టమొదటి వస్తువు ఎలెట్రిక్ రైస్ కుక్కర్ . ఇవి 100 మాత్రమే అమ్ముడుపోయాయి . అసలు విషయమేమిటంటే ధీనిలో అన్నం ఉడకడానికి బాధులుగా మందాడం ప్రధాన లోపం . విజయం అంత తేలికగా వరించదు అని ఆకియో మోరితకుకు అర్థమైంధీ . ఆ తరువాత సోనీ కోర్పరటిఒం ధిన ధిన ప్రవర్తమానమైంది . ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద ఎలెక్ట్రానిక్ వస్తు తయారీ కంపనీ గా నిలిచింది

Everyone might know about the industrialist Akio Morita,WHO is AKIO MORITA??He is the one and only one establisher of SONY ELECTRONICS corporation.The first product of SONY is electric rice cooker,only 100 pieces were sold at that time of launching.The main drawback of the rice cooker is burning instead of cooking.At the time he knows about one thing,that is Success doesn't come easily.SONY got experiences day by day and it became the world's six largest product company.

Friday 18 March 2011

Albert Einestein

                                                    విజయాన్ని సొంతం చేసుకున్న శాస్త్రవేత్త
భౌతికశాస్త్ర మేధావుల్లో ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మొదటి శ్రేణికి చెందినవాడని చెబుతారు. ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావాలను వివరించి చెప్పడంతో పాటు, భౌతికసాత్ర విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా  నోబల్ భహుమతి  వరించింది. ఐన్‌స్టైన్ విధ్యార్థిగా ఉన్నపుడు తరగతిలో ఎప్పుడు వెనుకబడి ఉండే వాడు . ఆఖరికి "ఇక లాభం లేదు నీవు పాఠశాలకు  రాకుండా ఉండడమే మంచింది" అని ఒక రోజు టీచర్ అన్నారట . ఐన్‌స్టైన్ మానసికంగా యెదగలెదు అని తల్లితండ్రులు భాధపడుతూ ఉండేవారు . అలాంటి ఐన్‌స్టైన్ ప్రపంచం గర్వించేంతటి శాస్త్రవేత్తగా ఎదిగాడు.

Wednesday 2 March 2011

Interesting Facts Written in telugu



 
తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8  రెట్లు పెద్దది.




Thommidhi Grahaalakunna Upagrahaalannintilo athi peddhadhi Ganymede ,Bruhaspathi(Jupiter) Chuttu Thirige Idhi BhudhaGraham Kanna 8 Retlu Peddhadhi.




 

అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.
Anni Yedaarulloki Athi Peddhadhi Sahara Yedaari



                         సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.




     

కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.



మనం పీల్చే ఆక్సిజెన్లొ  20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.

 



 
ప్రతి రోజు అమెరికన్లు అందరు కలిసి సుమారు  75 ఎకరాల విస్తీర్ణంకి సమానమైన  pizza లు  తినేస్తున్నారు


 


ప్రపంచవ్యాప్తంగా  7500  రకాల వస్తువులపై మికిమౌస్ కనిపిస్తుంది.

 


సముధ్రాల్లో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.




 
                     అమెరికాలో అన్ని పందెం గుర్రాల పుట్టినరోజుల్ని జనవరి  1నే జరుపుతారు.





 

                        ఒక పెన్సిలుతో సుమారు 50 వేల ఎంగ్లీషు పదాలు 
                         రాయొచ్చు. 






ఒక ఎర్ర రక్త కణమ్ సెకన్లలో శరీరాన్ని చుట్టూ తిరిగేసివస్తుంది.





                               
పాండాలు రోజులో  14 గంటలు తింతూనే ఉంటాయి.






                       ఖడ్గమృగాలు కలత చెందినప్పుడు వాటి స్వేదం ఎర్రగా 
                     మారుతుంది.







                                   

                                         నాలుకపైన సుమారు   9వేల రుచి గ్రంధులుంటాయి.






క్షీరదాల్లో ఒక్క ధ్రువపు ఎలుగుబంత్లకు మాత్రమే అరికాళ్ళపై వెంట్రుకలు ఉంటాయి.






 

దాల్ఫిన్లు నిధ్రలో ఉండగానే ఈద గలవు.







 

                                                           కుందేళ్లకు అసలు చెమట రాదు.

 





అమేరిక అద్యక్షుడికి భవనమైన వైట్ హౌస్ లో కత్తులు ,ఫోర్క్‌లు , చెంచాలు కలిపి  సుమారు 13000 ఉన్నాయి.



 
ఆలివె చెట్లు  1500 ఏళ్లు బతుకుతాయి.

 




ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న విధ్యుత్ శక్తి 33 శాతాన్ని ,పెట్రోలులో 29 శాతాన్ని అమెరికాలో ఒక్కటే ఉపయోగించుకుంటుంది.




ప్రపంచవ్యాప్తంగా   5 వేలు రకాల బంగాళదుంపలున్నాయి.





                   
                       అన్ని పండ్లలోకి అవొకాడో ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

 





                                జింకలు రోజుకు 5 నిముషాలు మాత్రమే నిధ్రిస్థాయి.

 




కోలాలు రోజుకు 19 గంటలు నిధ్రిస్థాయి.





 


వెదురు మొక్కలు ఒక రోజులో మూడు అడుగులకు పైగా పొడవు పెరుగుతాయి.

 


 

ఒక ప్లాస్టిక్ బాటల్ భూమిలో కరిగిపోడానికి సుమారు   450  ఏళ్లు పడుతుంది. 






 


తుపాను గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ను బాంబుతో సమానం.

 




 

 తుమ్మినప్పుడు గాలి  గంటకి    100 మైళ్ళ వేగంతో వస్తుంది.

 



 
ధృవపు ఎలుగు బంటులు ఆగకుండా 108 కిలోమీటర్లు ఈధ గలవు.






 


                  గోల్డ్‌ఫిష్ లు పరారుణ,అతినీలలోహిత కాంతిని కుడా చూడగలవు.

 

 

హుపింగ్ కొంగల కళ్ళు పుట్టినప్పుడు నీలిరంగులో ఉంటే, ఆర్నెల్ల తరువాత బంగారం రంగులోకి మారిపోతాయి.

 



పెసిఫిక్ సముధ్రంలో సుమారు 25 వేల ధీవులున్నాయి . ఇవి భూమి మీద ఉన్న ధీవుల సంఖ్య కన్నా ఎక్కువ.




ఏలాస్కా బ్రౌన్ ఎలుగుబంటీ సుమ్మారు 771 కిలోల బరువుంటుంది. 

 




లెమన్ షార్క్లకు 14 రోజులకోకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయి . అలా ఏదాధిలో సుమారు 24 వేల పళ్ళు వస్తాయి.



                    ఏనుగు తోండమ్ తో సుమారు  7లీటర్ల నీటిని పీల్చుకోగలదు.

 



 
                               పన్నెండు లక్షల ధోమలూ ఒకేసారి మన శరీరంలోని రక్తాన్నంత పీల్చేయగలవు.

 




             
సముద్రంలో అతి వేగంగా పెరిగే మొక్క జైఈంట్ కెల్ప్ ,దీని ఏధుగుదల రోజుకు 2అడుగులు.





          షార్క్ లు రక్తపు బొట్టు వాసన్ని మైలు దూరం నుంచే పసిగట్టగలవు.

 


 

ఆల్బత్రాస్ పక్షులు ఎగురతూనే నిద్రపోగలవు