చిలకా గోరింక పెళ్లి చేసుకున్నాయి . కాపురం పెట్టాలంటే ,ఇల్లు కావాలి కదా ? అది కాకమ్మ ఇంటికి వెళ్ళాయి. 'నీ ఇల్లు పెద్దది కదా ? మాకొక వాత ఇస్తావా ?' అని అడిగాయి .
కాకమ్మ సరేనంది . చిలకా గోరింకా ఓ వాటాలో చేరాయి . ముచ్చటైన ఆ జంటను చూసి , కాకమ్మ ఓర్వలేక పోయింది . కళ్ళలో నిప్పులు పోసుకోసాగింది . తన కుళ్ళు భోతు తనాన్ని గుండెల్లో దాచుకుని ,పైకి మాత్రం తియ్యగా మాట్లాడేది . గోరింకకు కాకమ్మ అంతరంగం కొద్దికొద్దిగా అర్ధంకాసాగింది . కాకమ్మతో స్నేహం చనువు తగ్గించమని చిలకమ్మకు పదేపదే చెప్పసాగింది . చిలక పట్టించుకోలేదు . ' అల అన్తావెం మామా? కాకమ్మ పిన్ని ఎంత మంచితో తెలుసా? ' అంటుండేది .
ఒకనాడు 'మరదలా? ఈ రోజు పడగకద ? మధ్యానం నేను వెచ్చేసరికి సేమ్యా పాయసం వండి పెట్టు ' అని పెళ్ళాంతో
చెప్పి గోరింక బయటికి వెళ్ళింది . చిలకమ్మకు దిగులుజ్ పట్టుకుంది . పాయసం ఎలా వండాలో తనకు తెలియదు . తానెపుడు తినలేదు కుడా . తన తల్లి తనకు నేర్పలేదు .
'దిగులేందుకే పిచ్చిపిల్లా! పాయసం ఎలా చేయాలో నీకు నేను చెపుతాను కదా ? అంటూ కాకమ్మ దారియం చెప్పింది. 'పొయ్యి మీద బాణలి పెట్టు . జీడిపప్పు , కిస్స్మిస్స్ దోరగా వేయించుకుని పక్కకు తీసి ఉంచుకో , భానలిలో రెండు గిన్నెల ఉప్పు వేసి బాగా కలుపు ,సేమ్యా ఉడికాక గిన్నెడు చెక్కర దాని మీద చల్లి , బాణలి దించుకో , నోరూరించే పాయసం రెడీ . !'
చిలకమ్మ మురిసిపోయింది . భర్త వచ్చేలూగా, కూని రాగాలు తీస్తూ ,పాయసం సిద్ధం చేసింది , గోరింక ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుంది . గోరింక తన పెళ్ళాన్ని చావా భాదుతుంటే పండగ చేసుకుందామని దాని ఆశ !
అయితే , కాకమ్మ ఆశించినట్లే జరగలేదు . గోరింక పాయసం గుట గుటా తాగేసింది . ' ఆహ ! ఓహో ! ఎంత బాగా చేసావు ఇలాంటి పయాసం నేనెపుడు తాగలేదు సుమా!' అంటూ మెచ్చుకుంది . నోరు తుడుచుకుంటూ బయటకు వచ్చింది .చాటున నిలబడి , అది కాకమ్మను చూసి , ' నా పెళ్ళాం తన చేతిలో నాకేమిచ్చినా , అది అమ్రుతంగానే ఉంటుంది అని తెలియదా అత్హ ?' అంటూ నవ్వింది . కాకమ్మ ముఖం మాడిపోయింది .
'నేను చేసిన పాయసం అంత బాగుందా?' అని సంబరపడిపోతూ , చిలక పయాసం నోట బెట్టుకుంది . తుపుక్కున ఉమ్మేసింది . కాకమ్మ దుర్బుద్ధి దానికి తెలిసిపోయింది , 'పాయసం ,చండాలంగా ఉందంటే పెళ్లమేక్కడ నోచ్చుకుంట్టుందో అని మేచుకుంటూ తిన్నాడు నా మొగుడు , అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది .
'మామా ! మనం ఇక్కడ వద్దు , తెల్లవారగానే మరో చోటుకి వెళ్లి పోదాము ' అని వాత కాలి అయిపోయింది .
No comments:
Post a Comment