Wednesday, 30 March 2011

Telugu Kadha---Chavunu jayinche upaayam

చంద్రగిరి పరిపాలించే సత్యవర్మకి మరణాన్ని జయించాలనే కోరిక కలిగింది . మంత్రిని రప్పించి తన కోరిక బయటపెట్టాడు  . 
'ప్రభు ! ఈ విశ్వంలో నసిచనిధంటూ ఏది ఉండదని చెబుతారు . పుట్టిన ప్రతి జీవికి గిట్టక తప్పదు , అయితే ఇక్కడికి  వెయ్యి ఆమడాల దూరము లో దీపశిఖ అనే పురాతన కోటలో ఓ మంత్రసిద్ధుడు మరణాన్ని జయించాడని మా తాతగారు చెప్పేవారు ' అన్నాడు మంత్రి '
సత్యవర్మ అమితోస్చాహంగా , ' అయితే నేనే స్వయంగా వెళ్లి ఆయన్ని కలుసుకుంటాను . నేను వచ్చే వరకు రాజ్యభారం మీదే ' అంటూ అప్పటికప్పుడే బయల్దేరాడు . 
ఆరు నెలల పాటు ప్రయాణించిన రాజు సత్యవర్మ చివరికి ఎలాగైతేనేం , పురాతనమైన దీపశిఖ కోటను చేరుకున్నాడు.
శిధిలావస్థలో కూలిన గోడలతో పిచ్చి మొక్కలు పెరిగిపోయిన ఆ కోటలో తిరగసాగాడు .ఇంతలో సాలెగూల్లు ధట్టంగం అల్లుకున్న ఓ గదినుంచి , 'ఎవరు నువ్వు ?' అనే మాటలు వినిపించాయి 
'నేను చంద్రగిరి మహారాజు ను , మ్రుత్యున్జయుడిని వెదుకుతూ వచ్చాను ' అన్నాడు సత్యవర్మ  
'నువ్వు వెతుకున్నది నేనే ! నీ పిచ్చి ఆలోచన మానుకుని వెంటనే వచ్చిన దారినే వెళ్ళు ' అని గదిలోంచి వినిపించింది .
    'లేదు .... నేను మీలాగా మృత్యువును జయిస్తాను ' 
    'అయితే లోపలి రా '
     రాజు సత్యవర్మ ఉస్చహంగా లోపలికి వెళ్లి అక్కడే దృశ్యం చూసి నివ్వెరపోయాడు .
      అక్కడొక వృద్ధుడు ధూళిలో పడుకొని ఉన్నాడు. అతడి జుట్టు గడ్డం చాల దూరం పెరిగిపోయి ఉన్నాయి .గోళ్ళు మెలితిరిగిపోయి కనిపించాయి . అతడి శరిరం పూర్తిగా  సుష్కించిపోయి చర్మం ఎముకలకు అతికించినట్టు ఉన్నది. 
'ప్రకృతి విరుద్ధమైన కోరికతో మంత్రోపాసన చేసి చావును జయించగాలిగాను కాని, శారిర సహజమైన ముసలితనాన్ని అడ్డుకోలేకపోయాను . కనీసం కదలడానికి కుడా ఓపిక లేని నా దుస్తుతిని కావాలంటే నీకు కుడా మంత్రం ఉపదేసితాను ' అన్నాడు మృత్యుంజయుడు .
              రాజు సత్యవర్మ మారు మాట్లాడకుండా అక్కడ నుంచి బయల్దేరి తిరిగి కోటకు చేరుకున్నాడు .
 
 

No comments:

Post a Comment