Saturday, 28 May 2011

Why we use Fuse?

అపుడప్పుడు ఫుసె పోయి విద్యుత్ ఆగిపోతు ఉంటుంది కదా?అసలు ఇది ఎందుకు ఉండాలి?
విద్యుత్తో పనిచేసే రెఫ్రిజిరేటర్  ,టివి, A C లాంటి పరికరాల గుండా విద్యుత్ ప్రవవాహం తీవ్రత ఎక్కువైతే అవి పాడయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.ఒకోసారి ఇళ్ళలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి.ఇలా జరగకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసేవే ఫ్యూజ్ లు .విద్యుత్ సరఫరా కేంద్రం నుంచి మన ఇంటి లోపలి  వరకు వివిధ దశల్లో వీటిని అమరుస్తారు.విద్యుత్ ప్రవవాహం అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయ్యే సందర్భాల్లో ఫ్యూజ్ లో  అమర్చే తీగ చటుక్కున కరిగి పోయి విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.సాధారణంగా ఫ్యూజ్ తీగలను కొన్ని లోహాల మిశ్రమంలో చేస్తారు.దిని ధ్రవిభావన స్థానం (మెల్టింగ్ పాయింట్)తక్కువగా ఉంటుంది  కాబట్టి,విద్యుత్ ప్రవాహ తీవ్రత పెరిగినప్పుడు ఫ్యూజ్ తీగ వెడ్డికి కరిగిపోతుంది.అందువల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయి ప్రమాదాలు తప్పుతాయి.చాల మంది ఫ్యూజ్ తరుచుపోకుండా ఉండడానికి అందులో రాగి తీగలను మెలిపెట్టి వాడుతుంటారు. ఇది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాగలదు.

No comments:

Post a Comment