Saturday, 28 May 2011

Why cat eyes are brighter in dark?

చీకటిలో పిల్లి కళ్ళు ఎందుకు మెరుస్తాయి?
చీకటిలో చురుగ్గా ఉండే పిల్లిలాంటి జంతువుల కళ్ళు చీకట్లో మెరవడానికి కారణం వాటి కళ్ళలో పరావర్తన సంబంధిత కణాలతో కూడిన  పొర ఉండడమే. వాటి కంటిలోని రెటినా వెనుక భాగంలో ఉండే ఈ పొరను 'తాపెటం లుసిడం  ' అంటారు.పిల్లి కళ్ళలో పడే అతి తక్కువ కాంతిని కూడా ఈ పొర పరావర్తనం చెందిస్తుంది.ఈ పొర మీద పడి పరావర్తనం చెందిన కాంతి దాన్ని రెటిన గుండా పయనించి బయటకు రావడం వల్లనే మనకు దాన్ని  కళ్ళు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి.ఈ పొర వల్లనే పిల్లి కళ్ళు సంగ్రహించే కాంతి పరిమాణం మిగతా జీవుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి చిక్కట్లో బాగా చూడగలవు. 

No comments:

Post a Comment