Saturday, 28 May 2011

How aroma comes from things?

కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది?
పదార్థాలు వివిధ భౌతిక ,రసాయనిక స్థితుల్లో ఉంటాయి.ఘన,ద్రవ,వాయు స్తితులతో పాటు,రసాయనికమగా రకరకాల అణు నిర్మానాలతో  ఉంటాయి. వాసన వచ్చే పదార్థాలకు ఆవిరయ్యే లక్షణం ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్నా,ద్రవ రూపంలో ఉన్న్న ఎంతోకొంత మేరకు సాధారణ ఉష్నోగ్రతల వద్దే ఆవిరవుతూ ఉంటాయి. ఆ ఆవిరిలో వాటి అణువులు ఉంటాయి . ఇవి మన నాసికా రంధ్రాలను చేరవేరినప్పుడు  మన ముక్కులోపలి తడి పొరల  మీద ఉన్న ఘ్రాణ నాడులు ప్రేరేపితమవుతాయి..అందుకనే వీటిని రసాయనిక గ్రహాకాలు అని కూడా అంటారు. ఇలా వివిధ పదార్థాల ఆవిరులలో వేర్వేరు అణువులు ఉండడం వళ్ళ ముక్కులోని నాడుల మీద వీటి ప్రభావం వాటి విలక్షనతతో  ఉంటుంది. వీటి వళ్ళ ప్రేరేపితంయ్యే నాడులు ఆయ విశిష్ట సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. వాటిని బట్టి మనం వేర్వేరు వాసనలను గుర్థుఇన్చగలుగుథాము.

No comments:

Post a Comment