పూలు అనేక రంగుల్లో ఆకర్షనియంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తి దోహదం చేసే కారణం ఉంది. ఒక పూవు లో ఉండే పుప్పొడి మరొక పూవును చేరినపుడే ఆయ మొక్కలో ఫలదీకరణం సాధ్యమవుతుంది. దిన్నె పరపరాగ సంపర్కం అంటారు. ఇందుకు సహకరించే కీటకాలు , పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతాయి . అదే పక్షులు, కీటకాల ప్రమేయం లేకుండా గాలిలో పుప్పొడి ఎగరడం ద్వారా పరపరాగ సంపర్కం సంభవించే కొన్ని గడ్డిమోక్కల విషయంలో ఆకర్షవంతమైన రంగులు కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు, కొన్ని మొక్కల విషయంలో పరపరాగ సంపర్కం పూర్తికాగానే , ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి వాటి పూలు రంగులు కోల్పోయి, వాటి రేకులపై మట్టి రంగులో మచ్చలు ఏర్పడుతాయి.దాంతో పక్షులు ,కీటకాలు ఆ పుల జోలికి పోకుండా తమను ఆకర్షించే రంగులుందే పులవైపే వెళతాయి .

No comments:
Post a Comment